NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు నిరాశ చెందకుండా ధైర్యంగా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలి

1 min read

కల్లూరు, న్యూస్​ నేడు:  కల్లూరు మండలం లక్ష్మీపురం లో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇందులో భాగంగా మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు వారు  పాల్గొనడం జరిగినది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నిరాశ చెందకుండా ధైర్యంగా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలని సూచించారు. తక్కువ నీటి అవసరం ఉండే, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, అంతరపంటలు సాగు చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని రైతులకు తెలియజేసి, PMDS వేయడం జరిగింది ఇప్పటికే సాగులో ఉన్న పంటల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని,PMFBY క్రాప్ ఇన్సూరెన్స్ 15/8/2026 ఆఖరి తేదీ లోపు చేసువాలని తెలియచేయడం జరిగింది.

About Author