వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
1 min read
పీహెచ్సీ కేంద్రాలలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : పీహెచ్సీ కేంద్రాలలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలనీ జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలో పిహెచ్సి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీహెచ్సీ కేంద్రాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. పిహెచ్సి సెంటర్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన మందులు వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రత, మౌలిక వసతులు, రోగి నిర్ధారణ పరీక్షలు, ఇతర అత్యవసర వైద్య సేవలను మెరుగుపరచాలని సూచించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలలో జిల్లాల్లో సాధించిన పురోగతి లక్ష్యాల సాధన వెనుకబడిన సూచికలు మరియు క్షేత్రస్థాయి పనితీరును మెరుగుపరచాలన్నారు. కేపిఐ నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన సూచికలు, లక్ష్యాలపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి, వెనుకబడిన అంశాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత వైద్యాధికారులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


