NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలి

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

తెర్నేకల్లులో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  మన భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మన ఆచార వ్యవహారాలే పునాదని, మన పూర్వీకులు ఆచరించిన సంప్రదాయాలు, పండుగలు, పూజా విధానాలు, కుటుంబ విలువలు, సత్ప్రవర్తనలు మన జీవన విధానానికి మార్గదర్శకాలని, ఆధునికతను స్వీకరిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరించకూడదని, ఆచార వ్యవహారాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక ప్రయోజనాలను తెలుసుకుని వాటిని ఆచరించాలని, ముఖ్యంగా యువతకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో  దేవనకొండ మండలం, తెర్నేకల్ గ్రామంలోని శ్రీలక్ష్మి చెన్నమాధవ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం అర్చకులు పూదత్తు సూర్యనారాయణ స్వామి, జంగం భానోదయస్వామి భక్తులందరితో గోపూజ మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహింపచేశారు. మూడు రోజులు ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో మండల పెద్దలు కె.మధుసూదన్ రెడ్డి, తెర్నేకల్ ఎంపిటిసి నామాల శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి కె.వీరన్న, పాలాక్షి రెడ్డి, కోటిరెడ్డి, తాజా మాజీ ఉపసర్పంచ్ కనక వీరన్న, భజన మండలి అధ్యక్షులు, కె. చిదానందచారి, గడ్డం నాగరాజు, వడ్డె వెంకటరాముడు, శ్రీనివాసులు రాఘవేంద్ర, జి.నాగరాజు, దొడ్డెప్ప, కె. మల్లేష్, బి. వెంకట రాముడు, గోవర్థనాచారి, ఎన్. రాజశేఖర్ రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *