రైతులకు సాగునీరు విడుదల చేయాలి
1 min read
రైతుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
హోళగుంద న్యూస్ నేడు: తుంగభద్ర జలాశయంలో సుమారు 90 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ ప్రాంతాల రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపిణీ అంశాన్ని వెంటనే పరిష్కరించి దిగువ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్న సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో జాప్యం చేయడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కాలువల ద్వారా నీరు అందితేనే సాగు పనులు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.కనీసం ఒక్క పంటకైనా నీరు అందించి రైతులను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటా ప్రకారం దిగువ కాలువకు నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని కోరారు. ఎల్‌ఎల్‌సీ కాలువ ద్వారా నీటి విడుదలపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.తుంగభద్ర జలాశయంలో నీరు ఉన్నప్పటికీ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా దిగువ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని, కనీసం ఒక్క పంటకైనా నీరు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యను అత్యవసరంగా పరిగణించి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి పంటలను కాపాడేందుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంపాపతి, ఎర్రిస్వామి, రామకృష్ణ, శేషిరెడ్డి, దిడ్డి వెంకటేష్ తదితర రైతులు పాల్గొన్నారు.


