NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

79 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రపంచ రికార్డు లక్ష్యం

1 min read

3ఏళ్ళ చిన్నారి అనంత దక్షిత్ సాహసయాత్ర

జెండా ఊపి చిన్నారి కి శుభాకాంక్షలు తెలిపిన ఎయస్పీ, శ్రీరాం చినబాబు

మదనపల్లె ఆగస్టు 14, న్యూస్ నేడు ప్రతినిధి  :79 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రపంచ రికార్డు లక్ష్యంగా  మదనపల్లె నుంచి కదిరి వరకు కేవలం 3 ఏళ్ల చిన్నారి అనంత దక్షిత్ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్‌లో పూర్తి చేసే ప్రపంచ రికార్డు ప్రయత్నాన్ని  ఘనంగా ప్రారంభించారు.శుక్రవారం మదనపల్లె పట్టణం అన్నమయ్య సర్కిల్ రింగ్ రోడ్ వద్ద ఉదయం 6:30 గంటలకు జరిగిన ప్రారంభ కార్య క్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ కె. వెంకటాద్రి పచ్చజెండా ఊపి చిన్నారి అనంత దక్షిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆర్మీ అధికారులు, దేశభక్తులు, స్థానిక యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారి దక్షిత్‌ను ప్రోత్సాహం అందించారు. ఈ సందర్బంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూమూడేళ్ల వయసులోనే స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించాలనే లక్ష్యంతో అనంత దక్షిత్  ఇంత చిన్న వయసులోనే 79 కిలోమీటర్ల స్కేటింగ్ ప్రపంచ రికార్డు లక్ష్యంతో ముందుకు సాగడం అభినందనీయమని పలువురు కొనియాడారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ మూడేళ్ల వయసులోనే అనంత దక్షిత్ ఇంతటి సాహసోపేతమైన లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. చిన్నారి పట్టుదల, ప్రతిభ మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని, ప్రపంచ రికార్డు ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.అనంత దక్షిత్ సాహస యాత్ర విజయవంతంగా పూర్తై ప్రపంచ రికార్డు సాధించాలని ఎయస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు.  చిన్నారి ప్రయాణానికి, ప్రయత్నానికి ప్రజలు, యువత, అభిమానులు అండగా నిలచి లక్ష్యాన్ని చేరుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు .

About Author