NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవాలి

1 min read

– లయన్స్ జిల్లా చైర్ పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు, న్యూస్​ నేడు:  దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన పౌరులుగా కృషి చేయాలని లయన్స్ జిల్లా చైర్ పర్సన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్, మరియు ప్రైమరీ స్కూల్, కె ఎన్ ఆర్ స్కూల్ నందు  చిన్నారులకు యువతకు  లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ మరియు అసోసియేషన్ ఆఫ్ అలియాన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117s, నైస్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు మరియు వివిధ విభాగాలలో ఆటల పోటీలను నిర్వహించి  బహుమతులను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఆయన డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచి, దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో  కట్టమంచి  రామలింగారెడ్డి మెమోరియల్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్మాస్టర్  ఇందిరా ప్రియదర్శిని  ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

About Author