NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఘనంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

1 min read

మార్చి 2026 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన టాపర్లకు లక్ష రూపాయల నగదు బహుమతులు

కళాశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హోళగుంద న్యూస్ నేడు: కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్చి 2026 పరీక్షల్లో కళాశాల స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎల్‌ఎల్‌సీ బోర్డు చైర్మన్ మిక్కిలినేని ప్రసాద్ రూ.50,000, రూ.30,000, రూ.20,000 చొప్పున మొత్తం రూ.1,00,000 నగదు బహుమతులను అందజేశారు. అలాగే ద్వితీయ సంవత్సరం గ్రూప్ టాపర్లకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందించారు.అదేవిధంగా కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పంపన్న గౌడ్ తన సతీమణి, సిద్ధార్థ్ గౌడ్ తల్లి హెచ్. హేమావతి జ్ఞాపకార్థం ప్రథమ సంవత్సరం టాపర్లందరికీ కలిపి రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు.కళాశాల పూర్వ విద్యార్థి దేవరాజ్ ప్రథమ సంవత్సరం టాపర్లతో పాటు ద్వితీయ సంవత్సరం కళాశాల టాపర్‌కు కలిపి రూ.5,000 నగదు బహుమతితో పాటు మెడల్స్, జ్ఞాపికలను అందజేసి విద్యార్థులను అభినందించారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు, మెడల్స్, జ్ఞాపికలు అందించడం పట్ల కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్‌ఎల్‌సీ బోర్డు చైర్మన్ మిక్కిలినేని ప్రసాద్, ఆయన సతీమణి, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పంపన్న గౌడ్, కళాశాల కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సభ్యులు శేషగిరి, అబ్దుల్ సుభాన్, ఆదామ్, హైస్కూల్ కమిటీ చైర్మన్ ద్వారకనాథ్, కళాశాల పూర్వ విద్యార్థి దేవరాజ్, అధ్యాపకులు, పాత్రికేయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *