NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పర్యావరణ పరిరక్షణలో అందరి బాధ్యత..

1 min read

తెలుగు రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి సాయిబాబ

కౌతాళం, న్యూస్​ నేడు: మండల పరిధిలో,ఉప్పరహాల్,గ్రామం,పర్యావణ పరి రక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఇది అందరి బాధ్యత కావాలని  తెలుగు రైతు సంఘం జిల్లా అధికార ప్రతినిధి సాయిబాబు  పిలుపునిచ్చారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా  కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు సాయిబాబు తనవంతుగా వెయ్యి మొక్కలను అందజేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విద్యార్థుల,ఉపాధ్యాయుల గ్రామస్తుల సహకారంతో కార్యక్రమం చేపట్టారు.తన వంతుగా ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు సహాయ , సహకారాలు సాయిబాబు అందిస్తున్నట్టు ఆయన సేవా భావాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌.ఎం. భాగ్యమ్మ , పాఠశాల ఉపాధ్యాయులుసంగమేశ్ , ఆర్‌.ఎల్‌.ఎన్‌. ప్రసాద్,మంజుల, విజయలక్ష్మి , శోభాలత ,ఉచ్చప్ప, ప్రావళిక , ఎస్‌ఎంసీ చైర్మన్ కె. మల్లి ,మాజీ ప్రెసిడెంట్ , ఈరన్న ,టీడీపీ యువ నాయకులు కె. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author