NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంతోమంది త్యాగధనుల పుణ్యఫలితమే భారత దేశ స్వాతంత్ర్య ఫలం

1 min read

జిల్లా గవర్నర్ డాక్టర్:దశిక సుబ్బారావు

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరులోని గ్రీన్ సిటీ లో గల లయన్స్ భవనము నందు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా గవర్నర్ డాక్టర్:దశిక సుబ్బారావు  జాతీయజెండా ఎగురవేసి సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల పుణ్యఫలితమే భారత దేశ స్వాతంత్ర్య ఫలమని,భారతీయులమైన మనందరం,త్యాగధనుల పుణ్యభూమిలో జన్మించటం అదృష్టం అని అన్నారు. విశాలమైన భారతదేశంలో లయన్స్ ఇంటర్నేషనల్ లోని లయన్స్ క్లబ్బులు వారి వారి పరిధిలో గల సామాజిక సమస్యలను గుర్తించి సేవలందించటం భారతీయ లయనిజానికే గర్వకారణం అన్నారు.జిల్లా పూర్వ గవర్నర్లు  కాకరాల వేణుబాబు,వి మురళీమోహన్ రావు లు మాట్లాడుతూ కేవలం జెండా ఎగరవేయటమే మన లక్ష్యం కాదని మన పుణ్య భారతావనికి ప్రతి మానవుడు చేతనైనంత సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు,జిల్లా క్యాబినెట్ కోశాధికారి కె.బి.రావు,చీఫ్ ఎడిటర్ వి. వెంకటస్వామి,రీజియన్ చైర్ పర్సన్ శాఖమూడి మురళి, లయన్స్ జిల్లా నాయుకులు కుర్మా శ్రీనివాస్,డి హేమ సుందర్,వి విష్ణుకుమార్ మరియు ఇతర లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *