అన్నమయ్య జిల్లా బిజెపి కార్యదర్శిగా ఎన్నికైన నిర్మల్ కుమార్
1 min read
తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు
అన్నమయ్య జిల్లా బిజెపి కార్యదర్శి నిర్మల్ కుమార్
అన్నమయ్య జిల్లా ఆగస్టు 17(న్యూస్ నేడు ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్,అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం అన్నమయ్య జిల్లా బిజెపి కార్యదర్శిగా నిర్మల్ కుమార్ ను ఎన్నుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.బిజెపి అన్నమయ్య జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీ నాయకులకు,జిల్లా పార్టీ నాయకులకు, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నిర్మల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు అందరికీ మరొక్కసారి రాయచోటి బిజెపి నాయకుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకముంచి బిజెపి అన్నమయ్య జిల్లాగా నియమించినందుకు తన శాయశక్తుల పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. క్షేత్రస్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలన్నారు.


