NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలలో సంతృప్తి స్థాయి పెరిగేలా పిజిఆర్ఎస్ అర్జీలు నాణ్యతగా పరిష్కరించాలి

1 min read

ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

మదనపల్లె ఆగస్టు 17, న్యూస్ నేడు ప్రతినిధి :ప్రజలలో సంతృప్తి స్థాయి పెరిగేలా పిజిఆర్ఎస్ అర్జీలు నాణ్యతగా త్వరిత గతిన పరిష్క రించాలని  ఇంఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలు నందు  ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమం  జరిగింది. ఈ  కార్యక్రమంలో ఇంఛార్జి జిల్లా కలెక్టర్ తోపాటు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కెఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్డిసి మాధవరెడ్డి, సర్వే శాఖ ఏడి శాంతరాజ్ ప్రజల నుండి ఫిర్యాదు లను స్వీకరించారు.  ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పార దర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పని సరిగా పరిష్కరించా లన్నారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్క రించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి అర్జీలను స్వీక రించారు.ఈ కార్య క్రమంలో మొత్తం 347 అర్జీలు రాగా వాటిపై తగు చర్య తీసుకొని పరిష్క రించు నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు  ఇన్‌చార్జ్ కలెక్టర్‌, సబ్ కలెక్టర్ ఎండార్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *