NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవీంద్రనాథ్ రాగూర్ కాటేజీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

1 min read

జాతీయ గీతం చరిత్ర ప్రతిబింబించే స్మారక భవనం, మ్యూజియం,  ఏర్పాటు చేయాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బండి సంజయ్ కి వినతి

మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి  : భారత జాతీయ గీతం రచించబడిన మదనపల్లె లో రవీంద్రనాథ్ రాగూర్  బస చేసిన కాటేజీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి అన్నమయ్య జిల్లా బీజేపీ కార్యదర్శిబర్నేపల్లె రవి కుమార్, బిజెపి రాష్ట్ర నాయకులు డా. జి అజ్మతుల్లా ఖాన్, బిజెపి నాయకులు కృష్ణయ్య వర్మ, పూల నాగరాజు లు వినతి పత్రం అంద జేశారు.ఆన్నమయ్య జిల్లా లో మదనపల్లె కు భారత దేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉందని గుర్తు చేశారు. రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన జన గణ మన జాతీయ గీతాన్ని ఆయన స్వయంగా బెంగాలి నుండి ఆంగ్లం లోకి అనువదించి, దానికి స్వరరూపం ఇచ్చిన చారిత్రక ప్రదేశంగా మదన పల్లె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ అపూర్వ వారసత్వం దేశానికి గర్వకారణం. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న  మదనపల్లెకు ఠాగూర్ బస చేసిన కాటేజీ కి తగిన స్థాయిలో అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, జాతీయ గుర్తింపు లభించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ అంశాన్ని పరిశీలించి మదనపల్లె బిటి కళాశాల ప్రాంగణంలో ఠాగూర్ బస చేసిన ప్రాంతాన్ని జాతీయ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు.జాతీయ గీత చరిత్రను ప్రతి బింబించే స్మారక భవనం, మ్యూజియం, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సంబంధించిన చారిత్రక ప్రాంతాలను సంరక్షించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు, రైల్వే, పర్యాటక, వస  తులు, ఇతర మౌలిక సదుపాయాలను మెరుగు పరిచి, ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మదనపల్లెకు విశేష గుర్తింపు తీసుకు రావడం తో పాటు దేశ చరిత్రలో చిర స్థాయిగా నిలిచిన ఈ పవిత్ర ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *