సైబర్ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు
1 min read
ఏలూరు 2టౌన్ మహిళా ఎస్ ఐ పి. నాగ కళ్యాణి
శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆధునిక యుగంలో సాంకేతిక-పరిజ్ఞానం కొత్తపుం తలు తొక్కుతున్న తరుణంలో సైబర్ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని ఏలూరు 2టౌన్ మహిళా ఎస్ ఐ పి. నాగ కళ్యాణి అన్నారు. ఏలూరు అశోక్ నగర్, ఎస్ పిడిబిటి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏలూరు టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శక్తి టీమ్ ఆధ్వ ర్యంలో విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగ కళ్యాణి మాట్లాడుతూఅపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు, వ్యక్తిగత – సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో డబ్బులు పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపుతూ మోసాలకు పాల్పడు తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని తెలిపారు. సెల్ఫోన్లకు వచ్చే గుర్తుతెలియని ఏపీకే ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు.


