NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైబర్ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు 

1 min read

ఏలూరు 2టౌన్ మహిళా ఎస్ ఐ పి. నాగ కళ్యాణి

శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆధునిక యుగంలో సాంకేతిక-పరిజ్ఞానం కొత్తపుం తలు తొక్కుతున్న తరుణంలో సైబర్ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని  ఏలూరు 2టౌన్ మహిళా ఎస్ ఐ పి. నాగ కళ్యాణి అన్నారు. ఏలూరు అశోక్ నగర్,  ఎస్ పిడిబిటి జూనియర్ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ఏలూరు టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.   శక్తి టీమ్ ఆధ్వ ర్యంలో విద్యార్థినులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై నాగ కళ్యాణి మాట్లాడుతూఅపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లు, వ్యక్తిగత – సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో  డబ్బులు పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశచూపుతూ మోసాలకు పాల్పడు తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని తెలిపారు. సెల్ఫోన్లకు వచ్చే గుర్తుతెలియని ఏపీకే ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *