బీసీలకు 34. శాతం రిజర్వేషన్ ఇస్తున్నందుకు బీసీలంత రుణపడి ఉంటాం
1 min read
శొంఠి శివరామ ప్రసాద్
యనమలకుదురు, న్యూస్ నేడు : గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లో పాల్గొని రెండేళ్ల సంక్షేమ అభివృద్ధి వివరిస్తూ శాసనసభలో.కూటమి ప్రభుత్వం బీసీలకు 34. శాతం రిజర్వేషన్ ఇస్తున్నందుకు బీసీలంత రుణపడి ఉంటాం .శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర గౌడ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్.ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ వర్గాలు హర్షాతిరేకాలతో స్వాగతిస్తోంది. ఇది బీసీ వర్గాల సామాజిక, రాజకీయ సాధికారతకు చారిత్రాత్మకమైన అడుగు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే చిరకాల ఆకాంక్షను ఈ ప్రభుత్వం నెరవేర్చింది.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ ,కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్. సవిత రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ వర్గాలు తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.రాష్ట్రంలోని అన్ని బీసీ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థానిక సంస్థల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలని పిలుపునిస్తున్నాము. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి మంచి కార్యక్రమానికి బీసీ వర్గాలు సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో కుటమి నాయకులు పాల్గొన్నారు.


