NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి

1 min read

వ్యవసాయం, ఉద్యాన పంటలు, తాగు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఎల్‌నినో ప్రభావంపై ప్రైమరీ సెక్టార్ అధికారులతో సమీక్ష

మదనపల్లె ఆగస్టు 18, న్యూస్ నేడు ప్రతినిధి :జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో నెల కొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం, ఉద్యాన పంటలు, సూక్ష్మ నీటిపారు దల, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, సహకార శాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర ప్రాథమిక రంగాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వ హించారు.ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, లోటు వర్షపాతం ప్రభావం, ఈ-క్రాప్ నమోదు, పంటల బీమా, ఉద్యాన పంటల సాగు, అంశాలను కలెక్టర్ సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4,60,455 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు సుమారు 50,597 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారని అధికారులు కలెక్టర్‌కు వివ రించారు.ప్రస్తుతం నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతాలు, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న గ్రామాలు, బోర్ల పరిస్థితి, బోర్ల లోతు పెంచడం, మోటార్లను లోతుకు దించడం, నీటి వనరుల రీఛార్జ్ వంటి అంశాలపై సమీక్షించారు.ఈ సమావేశంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *