NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దోమల నివారణతోనే ప్రాణాంతక వ్యాధుల నుండి ఉపశమనం

1 min read

న్యూస్ నేడు,పత్తికొండ:  దోమలను పూర్తిగా నిర్మూలించడంతోనే ప్రాణాంతక వ్యాధుల నుండి ఉపశమనం దొరుకుతుందని ఎం పి హెచ్ ఈ ఓ సాయిబాబా సూచించారు.ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పత్తికొండలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోమల వృద్ధి కేంద్రాలను నిర్మూలించడం, నీరు నిల్వ ఉండకుండా చూడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు,  ఎంపిహెచ్​ఓ  సాయి బాబా, ఎంపీహెచ్​ఎస్​  ప్రకాష్, ఎంపీహెచ్​ఎస్ వరలక్ష్మి,   ఎంపిహెచ్​ఏ రమేష్ బాబు, కర్రెన్న ఐసిటిసి సిబ్బంది,  ఏఎన్​ఎం లు, ఎంఎల్​హెచ్​పి  లు, ఆశా కార్యకర్తలు మరియు జూనియర్ కళాశాల నర్సింగ్ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాల్గొని. “దోమల నివారణే మన ఆరోగ్య రక్షణ – పరిసరాల పరిశుభ్రతే మన బాధ్యత” అనే సందేశంతో ర్యాలీలో ప్రజలను చైతన్యపరిచారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *