దోమల నివారణతోనే ప్రాణాంతక వ్యాధుల నుండి ఉపశమనం
1 min read
న్యూస్ నేడు,పత్తికొండ: దోమలను పూర్తిగా నిర్మూలించడంతోనే ప్రాణాంతక వ్యాధుల నుండి ఉపశమనం దొరుకుతుందని ఎం పి హెచ్ ఈ ఓ సాయిబాబా సూచించారు.ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పత్తికొండలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దోమల వృద్ధి కేంద్రాలను నిర్మూలించడం, నీరు నిల్వ ఉండకుండా చూడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఎంపిహెచ్ఓ సాయి బాబా, ఎంపీహెచ్ఎస్ ప్రకాష్, ఎంపీహెచ్ఎస్ వరలక్ష్మి, ఎంపిహెచ్ఏ రమేష్ బాబు, కర్రెన్న ఐసిటిసి సిబ్బంది, ఏఎన్ఎం లు, ఎంఎల్‌హెచ్‌పి లు, ఆశా కార్యకర్తలు మరియు జూనియర్ కళాశాల నర్సింగ్ విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాల్గొని. “దోమల నివారణే మన ఆరోగ్య రక్షణ – పరిసరాల పరిశుభ్రతే మన బాధ్యత” అనే సందేశంతో ర్యాలీలో ప్రజలను చైతన్యపరిచారు.


