NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో “సబ్ కోర్టు” ఏర్పాటు చేయాల్సిందే

1 min read

కాలినడకతో న్యాయవాదుల నిరసన

న్యూస్ నేడు, పత్తికొండ : రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ తో పాటు డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు కారప్ప, ఎల్లారెడ్డి, సత్య నారాయణ డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి నాలుగు స్తంభాల  వరకు న్యాయవాదులు కాలినడకతో ర్యాలీగా వచ్చి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2014 శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ ముఖద్వారం అయిన కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హోసూరు పర్యటనలో 90 రోజుల్లో కర్నూల్ కి శాశ్వత హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని చెప్పారని గుర్తు చేశారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు సుదూర ప్రాంతంలో ఉన్న విజయవాడ హైకోర్టుకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్  ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్ కోర్టు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ లా-మినిస్టర్ గారిని కలిసి వివరించారని, కానీ లా మినిస్టర్ ఇప్పటివరకు సబ్ కోర్ట్ గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *