నిరుద్యోగ యువతకు అమర రాజా బ్యాటరీస్ సంస్థ శిక్షణా కార్యక్రమం
1 min read
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి
శిక్షణా కాలము 12 నెలలు ఉండును3) నెలలు,ఉచిత వసతి మరియు భోజన వసతి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వైస్ ఛైర్మన్ మరియు మేనేజింగు డైరెక్టరు,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులములు సహకార ఆర్ధికసంస్థ లిమిటెడ్ తాడేపల్లి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని యస్.సి. నిరుద్యోగ యువతకు అమర రాజా బ్యాటరీస్ సంస్థ వారు నేషనల్ అప్రెంటీస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) క్రింద ప్రస్తుతము అందుబాటులో ఉన్న శిక్షణా కార్యక్రమములు చేస్తున్నారని, ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి ఒక ప్రకటనలో తెలిపారు.వీటిలో భాగంగా 1, SMT / PCB Assembly Operator కోర్సు యొక్క శిక్షణా కాలము 10th పాసు / ఫెయిల్ అయిన వారికి 24 నెలలు & ఇంటర్ పాసు / ఫెయిల్ అయిన వారికి 18 నెలలు శిక్షణ ఉండును. శిక్షణా కాలము నందు నెలకు రూ 12,360/- లు స్టైఫెండు అందించేదరు. 2. Training in Electrical (Domestic & Industrial) కోర్సు యొక్క శిక్షణా కాలము 12 నెలలు ఉండును. శిక్షణా కాలము నందు నెలకు రూ 12,632/- లు స్టైఫెండు అందించేదరు 3. Training in Plumbing కోర్సు యొక్క శిక్షణా కాలము 12 నెలలు ఉండును. శిక్షణా కాలము నందు నెలకు రూ 12,632/- లు స్టైఫెండు అందించేదరు. పై కోర్సులకు అభ్యర్ది యొక్క వయస్సు 18 సం.లు నుండి 30 సం.లు ఉండవలెను. 10th పాసు / ఫెయిల్ లేదా ఇంటరు పాసు / ఫెయిల్ అయి ఉండవలెను.పై కోర్సులను అమరరాజా స్కిల్ డవలప్మెంటు సెంటరు, పేటమిట్ట, తలపులపల్లి (పోస్టు), చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నందు ఇవ్వబడును. మొదటి మూడు (3) నెలలు ఉచిత వసతి మరియు భోజన వసతి కల్పించబడును. తదుపరి సబ్సిడీ పై భోజనం మరియు వసతి కల్పించబడును. శిక్షణ నందు అర్హత సాదించిన వారికి అమరరాజా గ్రూపు సంస్థ నందు ఖాళీలను బట్టి ఉపాధి అవకాశములు కల్పించుటకు అవకాశం కలదు.పై కోర్సులలో శిక్షణ పొందుటకు ఆసక్తి కలిగిన ఎస్.సి.నిరుద్యోగ, యువతీ యువకులు పూర్తీ వివరములు కొరకు ఎస్.సి.కార్పొరేషన్, ఏలూరు కార్యాలయమును నేరుగా గాని ఫోనుద్వారా గాని ఈ కార్యాలయపు సిబ్బంది శ్రీ K.Suguna Rao – 97013 55337, P.Ramanjaneya Prasad – 97058 63666 వారిని సంప్రదించవచ్చును.శిక్షణ పొందుగోరు అభ్యర్ధులు దరఖాస్తుతో పాటు వారి కుల ధృవీకరణ పత్రము, విద్య అర్హత, ఆధారు మరియు రైసు కార్డు నకళ్ళను జతపరచి స్వయముగా గాని, లేదా ఆఫీసు ఇ-మెయిల్ edscwg@yahoo.com కు ది.25-08-2026 లోపుగా సమర్పించవలెనని, ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి ఆ ప్రకటనలో తెలిపారు.


