కర్నూలు జిల్లా విద్యాధికారి కి ఫ్యాప్టో ధర్నా నోటీస్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ కొరకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరిగినది. అనవాయితీ ప్రకారం దరఖాస్తు చేసిన వారిలో సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ని నియామకం చేయవలసి ఉన్నప్పటికీ ఇంతవరకు నియామకం జరగలేదు. గతం లో కూడా జిల్లా ఫ్యాప్టో నాయకత్వం నకు జిల్లా విద్యాధికారి హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు నియామకం జరగలేదు అందుకని నేడు కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ మరియు ఆప్టా జిల్లా అధ్యక్షుడు ఎం మధుసూదన్ రెడ్డి మరియు ఫ్యాప్టో కర్నూలు సెక్రటరీ జనరల్ భాస్కర్(బి టి ఎ)నాయకత్వం లో కర్నూలు జిల్లా విద్యాధికారి కి ఫ్యాప్టో నాయకులు ధర్నా నోటీస్ అందచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 31 వ తేదీలోగా నియామకం జరగని పక్షం లో సెప్టెంబర్ 1 వ తేదీన కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించ బడుతుంది అని నోటీస్ ను జిల్లా విద్యాధికారి కి ఇవ్వడం జరిగింది.ఈ ధర్నా నోటీస్ కార్యక్రమం యందు రవి కుమార్ (యు టి ఎఫ్) నవీన్ పాటిల్ (యు టి ఎఫ్), జనార్దన్ ( ఎస్ టి యు) సుంకన్న (ఎస్ టి యు), ఇస్మాయిల్ (ఎ పి టి ఎఫ్ 1938), ఖాసీం జి (ఎ పి టి ఎఫ్ 257) హుస్సేన్ (ప్రధానోపాధ్యాయ సంఘము), భీమన్న (డి టి ఎఫ్), గోపాల్ (ఆప్టా)మరియు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.


