NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐఐటీ గౌహతి ఈవీ సర్టిఫికేషన్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు

1 min read

115 రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల మరియు జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక రవీంద్ర ఇంజనీరింగ్ మహిళా కళాశాల మరియు జి. పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కి చెందిన 115 మంది విద్యార్థులు “ఫౌండేషన్ కోర్స్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్” అనే  సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు కళాశాలల ప్రధానాచార్యులు డా. ఎన్.శ్రీకాంత్ మరియు డా. సి.శ్రీనివాస రావు లు తెలిపారు.ఈ కోర్సును ఐఐటీ గౌహతి టెక్నాలజీ, ఇంక్యుబేషన్ సెంటర్, నవయుగ్ ఇన్నోవేషన్స్ మరియు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అందించాయి.ప్రతి విద్యార్థికి ₹999 విలువ గల ఈ కోర్సును రవీంద్ర మరియు జి పుల్లయ్య కళాశాల యాజమాన్యం విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా అందించడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికత, డిజైన్, సస్టైనబిలిటీ వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో ఉద్యోగ అవకాశాలకు విద్యార్థులను సిద్ధం చేసింది. నేడు (ఆగస్టు 20, 2026న) 115 మంది విద్యార్థులు కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్లను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఐఐటీ గౌహతి టిబిఐ మరియు నవయుగ్ ఇన్నోవేషన్స్‌కు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్-సన్నద్ధ నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడంలో, పరిశ్రమ-విద్యా అంతరాన్ని తగ్గించడంలో రవీంద్ర మరియు జి పుల్లయ్య కళాశాలల నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. గ్రీన్ మరియు సస్టైనబుల్ ఇంజనీరింగ్ రంగాలలో విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఇటువంటి అత్యాధునిక శిక్షణా కార్యక్రమాలను కళాశాల నిరంతరం అందిస్తున్నాయి .ఈ కార్యక్రమంలో డీన్ ఇన్నోవేషన్ డా. సి. రంజిత్ కుమార్, సమన్వయ కర్త డా. కె.దీపక్ లు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *