NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే…

1 min read

36 లక్షల హెల్త్ సెంటర్ కు భూమి పూజ..

నందికొట్కూరు న్యూస్ నేడు: పాములపాడు మండలం ఇస్కాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 20 క్యూసెక్కుల 2 వేల ఎకరాలకు సాగు,తాగునీటిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా పూజలు చేసి నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వేంపెంట’లో రెడేళ్ల నమ్మకం-అభివృద్ధి  వేంపెంట గ్రామంలో’రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’లో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు.

తరిగోపుల’లో హెల్త్ సెంటర్ కు భూమి పూజ , జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో హెల్త్ సెంటర్ కు 15వ ఆర్థిక సంఘం 36 లక్షల నిధులతో ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈకార్యక్రమంలో అబ్జర్వర్ వెంకటశివుడు,నాయకులు, ప్రభుత్వ అధికారులు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *