NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం సక్రమంగా అమలు చేయాలి

1 min read

సబ్ ప్లాన్ నిధులు దళితులకే ఖర్చు చేయాలి

దళిత హక్కుల పోరాట సమితి ఏలూరు జిల్లా ఇన్చార్జి ఉప్పులూరి హేమ శంకర్

జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దళిత హక్కుల పోరాట సమితి (డి.హెచ్.పి.ఎస్) ఏలూరు ఏరియా సమితి మరియు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్దికి ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ పథకాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి కానీ,ఆ ప్రభుత్వాలే ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు. దళిత గిరిజన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడం, ఎస్సీ- ఎస్టీలకు సమాజం లోని ఇతర అగ్ర వర్గాలకు మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలను తొలగించడం,అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. దళితుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 సంవత్సరంలో ఎస్సీ- ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చినా సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించడం వలన దళితుల జీవితాలలో పెద్దగా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో నిధులు కేటాయించి దళితుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇతర దళిత సంఘాలను ప్రజాస్వామిక వాదులను కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు దళిత హక్కుల పోరాట సమితి పనిచేస్తుందని హెచ్చరించారు.  సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ దళిత నాయకులు మత్తె బాబీ మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులు ఎస్సీ-ఎస్టీ పథకాలకు ఖర్చు చేయకుండా, వేరే జనరల్ పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.కొన్ని సందర్భాల్లో నిధులు ఖర్చు కాక మురిగిపోతున్నాయని,ఏ ప్రభుత్వ శాఖలో కూడా ఎస్సీ – ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దళితుల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిరా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరి సుధారాణి మావూరి విజయ,గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, లక్కోజు జగదీశ్వరి, ఎం.ఏ.హకీమ్,ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, ఉప్పులూరి జ్యోతి,ఉప్పులూరి ప్రభావతి,మాల మహాసేన నాయకులు ఎరికిపాటి విజయ్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *