NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంసాని చిన్న నాగిరెడ్డి 25వ వర్ధంతి … సేవా కార్యక్రమాలు అభినందనీయం

1 min read

రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు

అన్నమయ్య జిల్లా ఆగస్టు 30 (న్యూస్ నేడు ప్రతినిధి): రాజంపేట నియోజకవర్గం లోని వీరబల్లి మండలం గడికోట గ్రామంలో సంసాని చిన్న నాగిరెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా వారి మనవడు, టీడీపీ నాయకులు నాగూర్ రెడ్డి (రాజారెడ్డి  కుమారుడు) ఆధ్వర్యంలో చీరల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ బాబు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంసాని చిన్న నాగిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, పేదలకు సహాయం చేయడం, అన్నదానం వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.ప్రజా సేవే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న నాగూర్ రెడ్డి ని  వారి కుటుంబ సభ్యులను ప్రసాద్ బాబు అభినందించారు. సంసాని చిన్న నాగిరెడ్డి  సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శప్రాయంగా నిలిచింది.

About Author