స్థానిక ఎన్నికల వేళ అలజడికి తావివ్వొద్దు!
1 min read
ట్రబుల్ మాంగర్స్కు ఎస్ఐ నాగార్జున కౌన్సెలింగ్
ప్యాపిలి న్యూస్ నేడు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్యాపిలి పోలీసులు దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్యాపిలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగార్జున ట్రబుల్ మాంగర్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో గొడవలు, అల్లర్లకు పాల్పడవద్దని, ప్రజాశాంతికి విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పోలీసులకు సహకరించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


