“వైద్య విద్య లో శరీర నిర్మాణానిది కీలక పాత్ర”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్.. ..”కర్నూలు వైద్య కళాశాలలో ప్రపంచ అనాటమీ దినోత్సవ వేడుకలు”.. వైద్య విద్య లో శరీర నిర్మాణానిది కీలక పాత్ర అని మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్ అన్నారు.. కర్నూలు వైద్య కళాశాల యందు శరీర నిర్మాణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ అనాటమీ దినోత్సవ వేడుకలను గత వారం రోజులుగా నిర్వహించిడం జరిగింది. వేడుకల్లో భాగంగా అక్టోబర్ 14న 2026 బ్యాచ్కు చెందిన ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు వక్తృత్వం, రంగవల్లులు, బాడీ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. వంద మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను, సృజనాత్మకతను ప్రదర్శించారు. సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు, పాల్గొన్న విద్యార్థులకు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ హరిచరణ్ బహుమతులు అందజేశారు. ‘‘శరీర నిర్మాణ శాస్త్ర ప్రాధాన్యం’’ అనే అంశంపై వక్తృత్వ పోటీ నిర్వహించారు.అనాటమీ విభాగ అధ్యాపకులందరూ కార్యక్రమాల నిర్వహణలో సహకరించి, విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. వైద్య విద్యకు పునాదిగా నిలిచే శరీర నిర్మాణ శాస్త్రంపై ఆసక్తిని పెంచడం, సృజనాత్మక అభ్యాసాన్ని ప్రోత్సహించడం, శరీర దాతల పట్ల కృతజ్ఞతాభావాన్ని పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం.ఈ కార్యక్రమం లో అనాటమీ విభాగాధిపతి డా. శోభాదేవి, ప్రొఫెసర్ డా. వాణిశ్రీ, మరియు సదరు విభాగ అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


