ఎంబిబిఎస్ మొదటి సం. అడ్మిషన్ లు ప్రారంభం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మెడికల్ కాలేజీ లయందు ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం స్టేట్ కోట కింద అడ్మిషన్లు నేటి నుంచి ప్రారంభమయ్యాయి అడిషనల్ డీఎంఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అడ్మిషన్లు ఈనెల 7వ తేదీ వరకు నిర్వహిస్తామని సెలవు రోజుల్లో కూడా అడ్మిషన్ ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందని తెలిపారు. నేషనల్ కోట అడ్మిషన్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మొదటిరోజు 34 మంది జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ హరి చరణ్, డాక్టర్ సింధియా శుభప్రద, డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ లక్ష్మి, ప్రొఫెసర్ ఎన్ హెచ్ ఓ డి ఫార్మసి డాక్టర్ రాజేష్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


