శ్రీకృష్ణుని జీవితం విద్యార్థులకు ఆదర్శం
1 min read
కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తూ ఉన్నత లక్ష్యాల వైపు పయ నించాలి
రేస్ బిఈడి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసులు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది : శ్రీకృష్ణుడుభగవద్గీత ద్వారా కర్తవ్యబోధ, ధర్మం, ఆత్మ విశ్వాసం, నిస్వార్థ సేవ వంటి గొప్ప విలు వలను ప్రపంచానికి అందించారని రేస్ బిఈడి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దడంలో తల్లి దండ్రులు, ఉపాధ్యా యుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి విద్యార్థి జీవితంలో మంచి ఆలోచనలు, జ్ఞానం, క్రమశిక్షణ, విజయాలను తీసుకురావాలని కోరుతూ విద్యార్థు లకు, ఉపాధ్యాయు లకు, శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థులు తమ సమ యాన్ని సద్విని యోగం చేసు కుంటూ ఎంచు కున్న రంగం లో రాణించేలా లక్ష్యాన్ని నిర్దేశించు కోవాలని తెలిపారు.
శ్రీకృష్ణుని జీవితం విద్యార్థులకు ఆదర్శమన్నారు.
శ్రీకృష్ణుడు బాల్యం లోనే చురుకుదనం, ధైర్యం, తెలివి తేటలు, స్నేహ భావం, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారని గుర్తు చేశారు. జీవితంలో ఎదు రయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, ధర్మంవైపు నిలబడటం, కర్త వ్యాన్ని నిర్వర్తించ డం వంటి అంశాల ను శ్రీకృష్ణుని జీవితం ద్వారా విద్యార్థులు నేర్చు కోవాలని సూచించారు. కావున విద్యార్థులు ఫలితం గురించి ఆందోళన చెందకుండా తమ కర్తవ్యాన్ని నిబద్ధ తతో నిర్వర్తిస్తూ ఉన్నత లక్ష్యాల వైపు పయ నించాలని ఆకాంక్షించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను కేవలం వేడుకగా కాకుండా శ్రీకృష్ణుని జీవితం లోని నీతి, ధర్మం, క్రమశిక్షణ, స్నేహం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను ఆచరణలో పెట్టే సందర్భంగా విద్యార్థులు భావించా లన్నారు.


