20వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అఖిలభారత వెనుకబడిన తరగతుల మరియు మైనారిటీ ఉద్యోగుల ఫెడరేషన్ (BAMCEF )20వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. వెనుకబడిన తరగతుల కులాధారిత జనగనన తోనే నిజమైన అభివృద్ధి…… BAMCEF 20వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6న అనంతపురం లో జరుగుతున్న సందర్బంగా మహాసభల కరపత్రాన్ని బాంసెఫ్ నాయకులు నేటి సాయంత్రం టౌనమోడల్ కాలేజీ ప్రాంగణం లో విడుదల చేశారు. ఈసందర్బంగా బాంసెఫ్ నాయకులు బహుజన్ ముక్తి పార్టీ జిల్లా కన్వీనర్ దాసరి రామశేషయ్య మాట్లాడుతూ దేశంలో 60%పై బడి ఉన్న వెనుకబడిన తరగతుల జనగననను ఎప్పటికప్పుడు వాయిదా వేయడమంటే అత్యధిక జనాభా ఉన్న ప్రజలను పాలకులు మోసం చేయడమే అన్నారు.. వెనుకబడిన కులాల జనగాననతోనే వారి అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. వెనుకబడిన తరగతులకు థాయిలాలు ప్రకటించి ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. ఇప్పటికైనా జనాభా గణనతో ఓబీసీ ల కులాల గనన చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేరుతో విద్యార్థులను మోసం చేయడం తాగదన్నారు. నీట్ మరియు ఎన్టీఏ ను రద్దుచేయాలన్నారు.. అనేక సామాజిక సమస్యలపై చర్చ జరుగుతుందన్నారు రాష్ట్రావ్యాప్తంగా వివిధ రంగాలకుంచెందిన మేధావులు.బంసెఫజాతీయఅధ్యక్షులు మాన్యవర్ వామన్ మేశ్రం హాజరుకానున్నారు..బాంసెఫ్ నాయకులు. ప్రిన్సిపాల్ శ్రీమతి యు. పద్మావతి . ఉద్యోగులు పాల్గొన్నారు…దాసరి.రామశేషయ్య.


