NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ల్యాబ్ టేక్నిషియాన్ లకు  కిటకజనిత వ్యాధుల నియంత్రణ పై  సమీక్షా

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి కార్యాలయ సమావేశ భవనంలో పట్టణ  /ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టేక్నిశియాన్ లకు  కిటకజనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంపై నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది ఈ  సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి డాక్టర్.కామేశ్వరరావు గారు మాట్లాడుతూ   పట్టణ  /ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టేక్నిశియాన్ లు      తప్పనిసరిగా కిటకజనిత మరియు అంటువ్యాధులు గుర్తిస్తే ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం లో(ఐహెచ్ఐపి) యాప్ లో   నమోదు చేయాలనీ తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటువ్యాధుల నిరోధం నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ను ఏర్పాటు చేశాయని తెలిపారు,ఈ కార్యక్రమం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని త్వరిగతిన నివారణ,నిరోధక చర్యలను చేపట్టి వ్యాప్తిని అరికట్టేందుకు  అవకాశం ఉందన్నారు., వ్యాధులను గుర్తించిన ఆయా ప్రాంతాల వైద్యులు ప్రభుత్వానికి సమాచారం ఇస్తే సత్వర నిరోధక చర్యలు చేపట్టవచ్చునని అన్నారు. లెప్రసీ న్యుక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్.మల్లికార్జున రెడ్డి  మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ పరిక్షలు చేసి  తప్పనిసరిగా  నిష్చాయ్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలనీ తెలిపారు.మలేరియ అధికారి వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ కిటకజనిత వ్యాదులైన మలేరియ,బోదకాలు,డేoగి,చికున్ గున్యా,మెదడువాపు లాంటి వ్యాధులను త్వరిగతిన గుర్తించాలని,క్షేత్ర స్తాయి సిబ్బంది ద్వారా వచ్చిన జ్వర అనుమానిత రక్తపూతలను ఎప్పటికప్పుడు పరీక్షించాలని వెంటనే ఐహెచ్ఐపి) యాప్ లో   నమోదు చేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమములో ఎపిడమలజిస్ట్ వేణుగోపాల్ యాదవ్ ,ప్రోజేక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *