గణేష్ మండపాలకు ఆన్లైన్ సింగిల్ విండో ద్వారా సత్వర అనుమతులు
1 min read
మతసామరస్యం, శాంతి భద్రతలే ప్రథమ ప్రాధాన్యం
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిది : రాబోయే వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి భక్తులకు, ఉత్సవ సమితి నిర్వా హకులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ‘సింగిల్ విండో విధానం’ ద్వారా సులభంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పోలీస్, ఫైర్, మున్సిపల్, ఎలక్ట్రిక్, రెవెన్యూ శాఖల అనుమతు లన్నీ ఒకేచోట సులభంగా పొందేలా వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సదుపాయం అందు బాటులో ఉందని గుర్తుచేశారు.జిల్లా లోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ తమ పరిధిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని స్వయంగా సందర్శించి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తుది అనుమతులు జారీ చేయాలని స్పష్టం చేశారు.అగ్నిమాపక, విద్యుత్ భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని నిర్ధారించు కోవాలి.మండపాల ఏర్పాటు వలన సాధారణ ట్రాఫిక్కు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంత రాయం కలగకుండా చూసుకోవాలి.వినాయక నిమజ్జన ఊరేగింపు మార్గాలు, నిమజ్జనం చేసే ప్రదేశాలు, ఊరేగింపు జరిగే సమయం తేదీల వివరాలను ముందుగానే సమీక్షించాలి.మండపాల అను మతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచ కుండా వీలైనంత త్వరగా పరిష్క రించి నిర్వాహ కులకు సహక రించాలని ఎస్పీ అధికారులకు సూచించారు. అదే సమయంలో, ఉత్సవాల వేళ కుల మత సామరస్యా నికి ఎలాంటి భంగం వాటిల్ల కుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని కోరారు.ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.


