మదనపల్లె పట్టణ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
1 min read
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం ప్రతినిది ) : జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మదనపల్లె పట్టణ ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లె ప్రాంతంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచాలని నిర్ణయించడం జరిగింది.అందులో భాగంగా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ చెరువు సామర్థ్యాన్ని 30 ఎం సి ఎఫ్ టి నుండి 40 ఎం సి ఎఫ్ టి వరకు కు, గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సామర్థ్యాన్ని 40 ఎం సి ఎఫ్ టి నుండి 50 ఎం సి ఎఫ్ టి వరకు కు, పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతొంది.తద్వారా మొత్తం 90 ఎం సి ఎఫ్ టి నీటిని నిల్వ చేసి,పుర ప్రజలకు వచ్చే 9 నెలల పాటు జూన్ 2027 వరకు తాగునీటి కొరత లేకుండా సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజ్ చెరువులలో నీటిని తీసుకునే ప్రదేశం చెరువు పూర్తి నీటి నిల్వ మట్టం కన్నా దిగువన ఉండటం వలన పూర్తి సామర్థ్యం విని యోగంలోకి రావడం లేదు. కావున చెరువులను లోతు చేసి, పూడిక తీసి అదనపు నీటిని నిల్వ చేసే విధంగా పనులు చేపట్టడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమ్మర్ ట్యాంకుల్లో నిర్మాణ వ్యర్థాలు, చెత్త, ఇతర వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నట్లు గుర్తించిన ఏ ట్రాక్టర్ నైనా వెంటనే సీజ్ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.ఎస్ ఎస్ ట్యాంక్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, జలవనరుల శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.



