NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెప్టెంబర్ , 12న అన్ని కోర్టు ప్రాంగణంలలో జాతీయ లోక్ అదాలత్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా న్యాయమూర్తుల తో  బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లతో మరియు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి.       ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా న్యాయమూర్తుల తో మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లతో స్థానిక జిల్లా కోర్ట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆరవ అదనపు జిల్లా జడ్జి మరియు ఫుల్ అడిషనల్ ఛార్జ్ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీ పి. వాసు , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి. ఈ సమావేశములో కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ మరియు రాజీ కాదగిన కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ఫ్యామిలీ కేసులు, చెక్ బౌన్స్ కేసులను  త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ ను  సెప్టెంబర్ 12వ తేదిన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లను చేసి  ఎక్కువ  కేసులు మరియు ముఖ్యంగా 10 సంవత్సరాల పైన పెండింగ్లో గల సివిల్ కేసులు పై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేసి  ఈ లోక్ అదాలత్ ను విజయవంతం అయ్యేలా  చేయాలని కోరారు. అలాగే అందరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా వారి సహకారం అందించి ఎక్కువ కేసులు పరిష్కరించాలని కోరారు.ఈ అవకాశమును కక్షిదారులు వినియోగించుకోని వారి కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించు కోవాలని కోరారు.  ఈకార్యక్రమంలో  ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల న్యాయమూర్తులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *