ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించాలి
1 min read
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో అన్ని శాఖలు టాప్ ర్యాంక్ లో ఉండాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెంపొందించేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ తదితర అంశాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ సేవలను బాగా అందించి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో అన్ని శాఖలు టాప్ ర్యాంక్ లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వాటిపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలకు సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ను సిద్ధం చేసుకుని రావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో మాతృ మరణాల నివారణకు వైద్య అధికారులు మరింత సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. అదే విధంగా త్రాగు నీటి సమస్య, రోడ్ల సమస్య, ఏపిఎంఎస్ఐడిసి భవన నిర్మాణాలు, శాఖల వారీగా ఉన్నటువంటి శాఖాపరమైన సమస్యలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకన్నారు. ఈ అంశాలను కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారి దృష్టికీ తీసుకొని వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.సమావేశంలో సిపిఓ భారతి, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డ్వామా పిడి నరసింహ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రావు, మెప్మా పిడి శ్రీనివాసులు, , డిపిఓ భాస్కర్, డీఎంహెచ్వో డా. కామేశ్వర ప్రసాద్, డిసిహెచ్ఎస్ డా.జఫ్రుల్లా, గనుల శాఖ డిడి నాగిని, డిటిసి శాంతకుమారి, తదితరులు పాల్గొన్నారు.


