ప్రజలతో ప్రత్యక్ష సంభాషణే పరిష్కార మార్గం
1 min read
ఫిర్యాదుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందే
ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 18 అర్జీలు
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు ప్రజలతో ప్రత్యక్ష సంభాషణే అత్యంత ప్రభావవంతమైన మార్గమని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. ప్రజల నుంచి వివిధ రూపాల్లో అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు.స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 18 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్.ఈ. రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, డిసిపి శబ్నం శాస్ర్తీ, ఏసీపీ నాగరాజు, కార్యదర్శి నాగరాజు, మేనేజర్ జునైద్, ఆర్వోలు క్రిస్టోఫర్, వాజిద్ తదితర అధికారులు పాల్గొన్నారు.


