NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడ ల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు పతకాల మోత 

1 min read

టెన్నిస్‌లో రన్నరప్‌ గా నిలిచిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మొత్తం 21 పతకాలు  కైవసం

విజేతలను  పతకాలతో సత్కరించిన జిల్లా ఎస్పీ

మదనపల్లె,  న్యూస్ నేడు ప్రతినిధి  : రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 4 వరకు జరిగిన ‘1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్  గేమ్స్– 2026’ పోటీల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరి చారు. కర్నూలు రేంజ్ తరపున ప్రాతినిధ్యం వహించిన అన్నమయ్య జిల్లా పోలీస్ అధికారు లు, సిబ్బంది తమ సత్తా చాటి మొత్తం 21 పతకాలను కొల్లగొట్టారు. ఈ ఘన విజయం సాధించిన క్రీడాకారుల బృందం మంగళవారం మదనపల్లె లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ని మర్యాదపూర్వకంగా కలిశారు. విజేతలను ఎస్పీ స్వయంగా అభి నందించి, పతకాల తో ఘనంగా సత్కరించారుమహిళా విభాగం పతకాలు  పి. శశికళ అద్వితీ య ప్రదర్శన – 7 పతకాలు, స్వర్ణం 2, బాక్సింగ్, హ్యాండ్ రెజ్లింగ్ రజతం 2, షటిల్, బాస్కెట్ బాల్ కాంస్యం 3, హ్యాండ్ బాల్, కబడ్డీ, రెజ్లింగ్.

పురుషుల వ్యక్తిగత విభాగం పతకాల బి. కేశవ ఆర్మ్ రెజ్లింగ్ – స్వర్ణం.

ఎం. నాగేంద్ర నాయక్ షాట్ పుట్ – రజతం, జావెలెన్ త్రో – రజతం. సి. జగదీష్: రెజ్లింగ్ – రజతం, గ్రీకో రోమన్ – కాంస్యం. ఇ. శ్రీను నాయక్ హై జంప్ – కాంస్యం.కె. సంతోష్ డిస్కస్ త్రో – కాంస్యం, టీమ్ గేమ్స్ పతకాలలో హ్యాండ్ బాల్ (స్వర్ణం): పిసి బి. శివకుమార్, పిసి మోహన్ రావు, పిసి పి. మనోహర్, పీసీ సి. శ్రీనివాసులు.హాకీ (రజతం): సిఐ చాంద్ బాషా, ఎస్ ఐ రహీమ్, హెచ్ సి అమర నారాయణ.ఫుట్‌బాల్ (రజతం)  శివ సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పతకాలు సాధించిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *