పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
1 min read
అర్హులకు పింఛను ప్రయోజనం అందేలా ప్రత్యేక పర్యవేక్షణ
సచివాలయాలకు వచ్చే దర ఖాస్తు దారులకు సౌక ర్యాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : సోమవారం నుంచి ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పార దర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగు తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్ధి దారులు దరఖాస్తు చేసుకునేందుకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయా ల్లో అవసరమైన మౌలిక సదుపా యాలు, సహాయ సహకారాలు అందు బాటు లో ఉంచాలని అధికారుల ను ఆదేశించినట్లు తెలిపారు. దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియను సక్రమంగా నిర్వ హించాలని సూచించారు.వృద్ధులు, వితంతు వులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్య కారులు, సంప్రదాయ వృత్తి దారుల్లో అర్హులైన వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛను కోసం దరఖాస్తు చేసుకో వచ్చని కలెక్టర్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లకు అర్హత ఉన్న వారు తమ పరిధిలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయా లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుదారులకు అవసరమైన సహాయాన్ని సచివాలయ సిబ్బంది అందించాలని, అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనానికి దూరం కాకుండా చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.



