NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“లీ” మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి అరుదైన గౌరవం

1 min read

మాస్టర్ మురళి కి ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ బ్రూస్ లీ పురస్కారం

విద్యార్థులకు పలు అవార్డులు

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : హైదరాబాద్ లో అమెచ్యూర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అవార్డ్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో అమర్ సింగ్, మాస్టర్ కేశవ్ గౌడ్ నిర్వహించిన గ్లోబల్ ఎక్సలెన్స్ ఐకాన్ అవార్డ్స్– 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ అవార్డు కార్య క్రమానికి గబ్బర్ సింగ్ సాయిబాబా, శివం శివరాత్రి, సంజయ్ దువ్వూరి, చైల్డ్ ఆర్టిస్ట్ సోనాలి నాథ్ లు ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా మదనపల్లె కి చెందిన “లీ” మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ మాస్టర్ మురళి కి ప్రతిష్ఠాత్మకమైన “ఇంటర్నేషనల్ బ్రూస్ లీ పురస్కారం” లభించింది. మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఆయన చేస్తున్న సేవలు, విద్యార్థుల కు అందిస్తున్న శిక్షణను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేశారు.అదేవిధంగా లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన 8 సంవత్సరాల వయస్సు గల విద్యార్థిని కె. హారికకు బుద్ధ పురస్కారం, కరాటే స్టార్ కిడ్ అవార్డు లను కె. మోక్షిత్, కె. ధనుష్,  సి. పృథ్విక్ నందన్, సి. విశాల్ వర్షల్ లు అందు కున్నారు. ఈ సందర్భంగా అకాడమీ విద్యార్థుల ప్రతిభ ను అభినందిస్తూ సీనియర్ మాస్టర్స్, సినీ నటులు, నిర్వాహకులు మాస్టర్ మురళి కి, విద్యార్థులకు ప్రత్యేక అభినంద నలు తెలిపారు.మాస్టర్ మురళి  మార్గదర్శకత్వంలో లీమార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని  ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *