NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీజనల్ వ్యాధుల పై గర్భిణీ స్త్రీల కు అవగాహన

1 min read

పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్:ట్వింకిల్,  అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు సూచనలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రతి గర్భిణీ స్త్రీ ప్రతి రోజు మంచి పౌష్టిక ఆహారము, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, మధ్యాహ్న సమయంలో తగిన విశ్రాంతి, శారీరిక వ్యాయామం చేయటం ద్వారా సుఖ ప్రసవం మరియు ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టే అవకాశం ఉందని లంబాడి పేట పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్:ట్వింకిల్,  అసిస్టెంట్ మలేరియా అధికారి జే. గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు లంబాడి పేట పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శించి ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ(పి యం ఎస్ యం ఎ )కార్యక్రమానికి  హాజరైన గర్భిణీ స్త్రీలకు వర్షా కాలంలో సాధారణంగా సంభవించే సీజనల్ వ్యాధుల పైన గర్భధారణ సమయములో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరిస్తూ గర్భధారణ సమయములో ప్రతి గర్భిణీ స్త్రీ మంచి పౌష్టికాహారాలైన పాలు కోడిగుడ్లు, రాగి జావా, ఆకుకూరలు, తాజా తాజా పండ్లు వేరుశనగ ఉండ, డ్రై ఫ్రూట్స్ తదితరు తీసుకోవాలని, తేలికపాటి వ్యాయామాలు చేయాలని, నెలకి 1,2 సార్లు వైద్యుల చే పరీక్షించుకోవాలని షుగర్, పిబి. పి పరీక్ష చేయించుకోవాలని, ప్రతినెల బరువు చూసుకోవాలని తద్వారా వైద్యుల సలహా పాటించాలని సూచించారు, వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు , జ్వరాలు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేయించుకోవాలని అక్కడ అనేక ప్రభుత్వ పథకాలు ఉచితంగా అందించబడుతుందని సూచించారు అవాంచిత గర్భం ధరించడం వలన ప్రైవేట్ మెడికల్ షాప్ కి వెళ్లి గర్భవిచ్చిత్త టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయని భవిష్యత్తులో వారికి తిరిగి పిల్లల పుట్టే అవకాశం ఉండదని డాక్టర్ ట్వింకిల్  సూచించారు   ఈ కార్యక్రమములో హెల్త్ అసిస్టెంట్ మేక శ్రీనివాసరావు,గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ చిట్టిబాబు  ఆరోగ్య కార్యకర్తలు, యం ఎల్ హెచ్ పి, స్టాఫ్ నర్సస్,ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

About Author