NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రైనేజీ పనులను పరిశీలించిన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య

1 min read

స్థానిక 39వ డివిజన్ లో 35 లక్షల రూపాయల వ్యయంతో

నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు

ఏలూరుజిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: స్థానిక 39వ డివిజన్ నందు 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పనుల ప్రగతిని పరిశీలించారు. పనుల నాణ్యతలో ఏ విధమైనటువంటి లోపాలు జరగకుండా,క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు డివిజన్ నాయకులు పర్యవేక్షించాలని సూచించారు. కోట విప్రముత్తంలో ప్రతి డివిజన్ లో  పారిశుద్ధ్యం  మరియు మంచినీరు విద్యుత్ దీపాలు డ్రైనేజీలు పలు ప్రజలకు అవసరమైన పనులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు ఎస్కే మీరా టిడిపి సీనియర్ నాయకులు మరియు డివిజన్ ఇంచార్జ్ బెల్లపు కొండ కిషోర్, డివిజన్ కో-ఇంచార్జ్ పలివెల కిషోర్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author