హుషారుగా వైసీపీ ప్రచార హోరు…
1 min read
అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా సిద్ధార్థ రెడ్డి..డాక్టర్ సుదీర్
చైర్మన్ అభ్యర్థి..కౌన్సిలర్లను అఖండ మెజార్టీతో గెలిపించండి..
నందికొట్కూరు న్యూస్ నేడు: మున్సిపాలిటీ చైర్మన్ వైసీపీ అభ్యర్థి ఫాతిమాభి మరియు కౌన్సిలర్ల గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ చేపడుతున్న ఎన్నికల ప్రచార హోరూ హుషారుగా సాగుతోంది.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం ఇద్దరూ వేర్వేరూ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.పట్టణంలో 18 వ వార్డులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్ అభ్యర్థి ఫాతిమాభీ మరియు వార్డ్ అభ్యర్థి భార్గవ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరిస్తూ సిద్ధార్థ రెడ్డి ముందుకు వెళ్లారు.పట్టణం అభివృద్ధి చెందాలంటే వైసిపి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
23 వ వార్డులో డాక్టర్ సుధీర్ ప్రచారం
పట్టణంలో 23వ వార్డులో చైర్మన్ అభ్యర్థి భర్త మన్సూర్ తో కలిసి డాక్టర్ సుధీర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వైసీపీ చైర్మన్ అభ్యర్థి మరియు వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి చింతా శశికళ గెలుపు కోసం రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని డాక్టర్ సుధీర్ ఓటర్లను కోరారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయలేదని లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో నాగలూటి అబ్దుల్ సలాం,అశోక్,వినోద్,కమాల్,చింతా విజ్జి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.



