కర్నూలులో టీడీపీలోకి భారీగా చేరికలు
1 min read
మంత్రి టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు నాయకులు, యువత
కర్నూలు, న్యూస్ నేడు : కర్నూలు నగరంలో మంత్రి టీజీ భరత్ నాయకత్వంపై నమ్మకంతో వివిధ వార్డులకు చెందిన పలువురు నాయకులు, యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీడీపీలో చేరారు. నగరంలోని 29వ వార్డుకు చెందిన డిష్ రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే 2వ వార్డుకు చెందిన అడ్వకేట్ మోషేష్ బాబు, 19వ వార్డుకు చెందిన షేక్ నజీమా బేగం టీడీపీలో చేరారు. 13వ వార్డుకు చెందిన యువత కూడా తెలుగుదేశం పార్టీలో చేరి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి టీజీ భరత్ నాయకత్వం, కర్నూలు నగర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి తమకు నచ్చడంతోనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు.



