8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో మంత్రి టీజీ భరత్
1 min read
అమరావతి, న్యూస్ నేడు: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, GSDP వృద్ధి, తాగునీటి వసతులు, గృహనిర్మాణం, జలధారతో పాటు జిల్లాల ఉత్తమ విధానాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన పాలన, సంక్షేమం అందించేలా సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.


