విద్యార్థులకు రక్త హీనతపై అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రీయ కిషోర స్వాస్త్య కార్యక్రమ కన్సల్టెంట్ మల్లికార్జున ఎర్రబురుజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని స్వామి వివేకానంద సంస్కృత ఉన్నత పాఠశాలలో లో నిర్వహిస్తున్న విఫ్స్ కార్యక్రములో పాల్గొని , విద్యార్థులకు రక్త హీనతపై అవగాహన కల్పించినారు, అలాగే ప్రభుత్వం అందించే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడడం వలన రక్త హీనత రాదని తెలిపారు, విద్యార్థినిలకు మధ్యనము భోజనము తరువాత ఐరన్ ఫోలిక్ మాత్రలను మింగాలని, శరీరంలో ఐరన్ చాలా కీలకమైనది, ఆహారంలో ఐరన్ లోపం ఉంటే రక్తం ఏర్రగా ఉండే గుణాన్ని తగ్గిస్తుంది , ఏర్ర రక్త కణాల్లోహెమో గ్లోబిన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది , ఈ స్తితినే రక్త హీనత అంటారు, దీంతో విద్యార్థులు నీరసం, నిస్సత్తువ పెరిగి చదువులో వెనకబడిపోతారు అని తెలియజేశారు 18 సంవత్సరములలోపు చేసే బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరమని బాల్య వివాహాల వలన తల్లి అయినచో తల్లి ప్రాణానికి ప్రమాదకరమని , పిల్లలు ఆరోగ్య లోపంతో పుడతారని తెలిపారు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించినారు, ఈ కార్యక్రమములో హెడ్ మాస్టర్ నీలవేణి, ఉపాధ్యాయులు, సచివాలయ ఆరోగ్య కార్యకర్త శిరీష, మరియు ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.


