NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏడాదిన్నర చిన్నారికి ఛాతీలొకి తిరగబడిన కడుపు

1 min read

– ఆపరేషన్ సమయంలో బయటపడిన అసలు సమస్య

– చిన్నారికి విజయంవంతగా చికిత్స

– నూతన జీవితానిచ్చిన కిమ్స్ కడల్స్ కర్నూలు వైద్యులు

కర్నూలు,  న్యూస్ నేడు : పుట్టుకతో వచ్చే సమస్య వల్ల ఆలస్యంగా ఓ ఏడాదిన్నర వయసున్న చిన్నారికి ఛాతీలోకి కడుపు తిరగబడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి నూతన జీవితాన్ని అందించారు కిమ్స్ కడల్స్ కర్నూలు వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు శస్త్రచికిత్స చేసిన పీడియాట్రిక్ సర్జన్ డా. సాయి కిరణ్. కడప పట్టణానికి చెందిన ఓ ఏడాదిన్నర వయసున్న బాలికకు ఆకస్మాత్తుగా కడుపు ఉబ్బడం, నోటిలో నుండి రక్తస్రావం అవుతుండంతో కిమ్స్ కడల్స్ కర్నూలుకి తీసుకవచ్చారు. వెంటనే చేసిన సీటీ స్కాన్ లో డాక్టర్లకు విస్తురుపోయే విషయాన్ని గమణించారు. కడుపు ఉండాల్సిన స్థానంలో కాకుండా ఛాతీలోకి కిందనుండి పైకి తిరగబడింది. అక్కడ పేరుకపోయిన ద్రవాన్ని బయటకు బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది ట్యూబ్‌ పెట్టేందుకు ప్రయత్నించగా ఇబ్బంది ఎదురైంద. మెదడుపై విషపదార్థాల ప్రభావంతో మూర్ఛలు రావడంతో పీఐసీయూ బృందం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించింది. డా. వాసు బుర్లీ, డా. రవి కిరణ్, డా. దిలీప్‌ సత్య, డా. సాహితి జి నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. వైద్యుల సమన్వయం, కుటుంబ సభ్యుల సహకారంతో చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. రేడియాలజిస్ట్ డా. అరవింద్ రెడ్డి, అనస్థీషియా డా. శ్రుతి వెన్నెల మద్దతునందించారు. మంచి ఆరోగ్యంతో విజయవంతంగా డిశ్చార్జ్ చేశామని తెలిపారు. 

కడుపు ఉబ్బితే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యుల సూచన

కడుపు తన చుట్టూ తిరిగిపోవడాన్ని గ్యాస్ట్రిక్‌ వోల్వులస్‌ అంటారు. దీనివల్ల కడుపుకు రక్తం అందకపోతే కణజాలం దెబ్బతిని ప్రాణాపాయం ఏర్పడవచ్చు. పుట్టుకతో ఛాతీ, కడుపు మధ్య పొరలో రంధ్రం ఉండి కడుపు వంటి అవయవాలు ఛాతీలోకి జారడాన్ని డయాఫ్రమ్‌ హెర్నియా అంటారు. చిన్నారుల్లో అకస్మాత్తుగా కడుపు ఉబ్బడం, వరుసగా వాంతులు, పాలు తాగలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన నీరసం లేదా స్పృహలో మార్పు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ కేసులో సకాలంలో సమస్యను గుర్తించి అత్యవసర శస్త్రచికిత్స చేయడం వల్ల చిన్నారి ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *