మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం:డివైఎఫ్ఐ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఈనెల 14వ తేదీన వినాయకుని పండగ సందర్భంగా డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మన పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకుందాం అనే అంశంతో పట్టణంలో ఉన్న స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో డాక్టర్ కార్తికేయన్ చేతులమీదుగా పోస్టర్ విడుదల చేయడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ జరుపుకునే వినాయకుని పండుగ అందరూ సంతోషంగా ఆహ్లాదకరంగా ఊరు వాడ అందరూ జరుపుకోవాలని అదే విధంగానే ముఖ్యంగా మట్టి వినాయకుని పూజించాలని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆ బాధ్యత మన ప్రజల అందరి పైన ఉందని పెద్ద పెద్దగా తయారు చేసే విగ్రహాలు కెమికల్స్ కలిపి చేస్తారు వాటి వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని అందుకే భక్తిశ్రద్ధలతో మట్టి వినాయకుడిని పూజిద్దాం డాక్టర్ కార్తికేయన్ అన్నారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సాయి నాయకులు తేజ, హరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


