NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెలుగుసంస్థ లో ఎంపీ జన్మదినం  సందర్భంగా అన్నదానం

1 min read

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది :మదనపల్లె మండలం కోళ్ళ బైలు పంచాయతీ, అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు సంస్థ లో శుక్రవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదినం సందర్బంగా వైఎస్ఆర్ పార్టీ అన్నమయ్య జిల్లా చైనేత విభాగ అధ్యక్షులు శీలం రమేష్ బాబు,  తొగటవీర క్షత్రియ మాజీ డైరెక్టర్ శీలం రమణమ్మ, పార్టీ నాయకులు వెలుగు సెక్రటరీ ఆధ్వర్యం లో దివ్యాంగులు, వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి  జన్మదిన శుభా కాంక్షలు తెలియ జేశారు. అనంతరం దివ్యాంగులకు, వృద్ధులకు అన్న దాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా శీలం రమేష్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు,వృద్ధుల మధ్య పెద్ది రెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకను జరపడం ఎంతో సంతోషంగా ఉందని, మిధున్ రెడ్డి ఆయురారో గ్యాలతో, రాజ కీయంగా గొప్ప పదవులు అలంకరించి ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. వెలుగు సెక్రటరీ యం. ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకను వెలుగు సంస్థలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం. ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్. భాగ్యలక్ష్మి, వెలుగు ప్రిన్సిపాల్ పి. లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వార్డెన్ యం . స్వీటీ, సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *