మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక ఎన్ ఆర్ పేట భాష్యం పాఠశాలలో ఈరోజు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు. భాష్యం చైర్మన్ రామకృష్ణ భాష్యం వైస్ చైర్మన్ హనుమంతరావు భాష్యం మేనేజింగ్ డైరెక్టర్ సాకేత్ జెడ్ఈఓ కవిత మేడం ఇచ్చిన పిలుపుమేరకు భాష్యం పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే మరియు ముందస్తు వినాయక చవితి పండగను జరపడం జరిగింది. విద్యార్థులు మరియు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి మట్టి వినాయకుడిని ధాన్యాల వినాయకుడిని పేపర్ గణపతిని పసుపు గణపతిని తయారు చేయటం జరిగింది. గణపతిలు తయారు చేయడం వల్ల పిల్లల్లో పర్యావరణాన్ని రక్షించటం జరుగుతుందని తెలియజేశారు. గణపతి రూపంలో వచ్చిన విద్యార్థులు మిగిలిన విద్యార్థులకు గణపతి పూజ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ పండగలు జరుపుకోటము ఎంత ముఖ్యమో అలానే పర్యావరణాన్ని కూడా కాపాడటం కూడా అంతే ముఖ్యమని తెలియజేశారు .కార్యక్రమంలో ఛాన్స్ హెచ్ఎం మాధవి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


