వినాయకుని నిమజ్జనం..ప్రశాంతతే ముఖ్యం
1 min read
మిడతూర్ ఎస్ఐ ఓబులే ష్..
మిడుతూరు న్యూస్ నేడు: ప్రశాంత వాతావరణంలో వినాయకుని నిమజ్జనం జరగడమే ముఖ్యమని మిడుతూరు ఎస్సై హెచ్ ఓబులేష్ మంగళవారం అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 64 వినాయకుని విగ్రహాలు ఉన్నట్లు ఎస్సై తెలిపారు.వినాయకుని నిమజ్జనంలో కమిటీ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చీకటి పడక ముందుకే వినాయకుని నిమజ్జనం చేయాలన్నారు. ఈరోజు బుధవారం మూడవ రోజున కడుమూరు జలకనూరు తలముడిపి చెరుకుచెర్ల బైరాపురం తిమ్మాపురం చింతలపల్లి మిడుతూరు నాగలూటి అలగనూరు దేవనూరు వీపనగండ్ల గ్రామాల్లో కలిపి మొత్తం 57 వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నట్లు అదేవిధంగా 5వ రోజు గురువారం పైపాలెం,49 బన్నూరు,చౌటుకూరు, ఉప్పలదడియ, కలమందలపాడు గ్రామాల్లో నిమజ్జనం ఉంటుందని ఈ నిమజ్జనంలో ఇలాంటి గొడవలు అలజడులు జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవలసిన బాధ్యత ఉందని ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలన్నారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


